జూనియర్ ఐశ్వర్య జోడిని వెతుక్కుంది

-

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు అప్పటికే ఉన్న స్టార్ హీరోయిన్స్ తో పోలిక పెట్టడం కామనే. ఆ క్రమంలో జూనియర్ ఐశ్వర్య రాయ్ గా పేరు తెచ్చుకున్న భామ స్నేహా ఉల్లాల్. బాలీవుడ్ లో లక్కీ సినిమాతో తెరంగేట్రం చేసిన స్నేహా ఉల్లాల్ తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో అలరించింది. ఇక సింహా సినిమాలో బాలయ్య పక్కన అదరగొట్టింది స్నేహా. తెలుగులో స్నేహా చేసిన 6 సినిమాలు ఆమెకు పెద్దగా క్రేజ్ తీసుకురాలేకపోయాయి.

బాలీవుడ్ లో కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. సినిమాలను దాదాపుగా తగ్గించేసిన స్నేహా ఉల్లాల్ తన సోషల్ బ్లాగ్స్ లో మాత్రం ఎప్పుడు అలర్ట్ గా ఉంటుంది. మంచు మనోజ్, బాలకృష్ణ లాంటి స్టార్స్ తో నటించినా టాలీవుడ్ లో స్నేహా కెరియర్ ఊపందుకోలేదు. అందుకే ఇక త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. తన స్నేహితుడు అవి మిట్టల్ తో స్నేహా ఉల్లాల పెళ్లికి రెడీ అవుతుందట.

కొన్నాళ్లుగా వీరి మధ్య సీక్రెట్ రిలేషన్ నడుస్తుందని ముంబై మీడియా వార్తల్లో రాసుకొచ్చింది. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ స్నేహా, అవి మిట్టల్ ఒకటవనున్నారు. ఇరు ఫ్యామిలీల అంగీకారంతో వీరి మ్యారేజ్ జరుగనుందట. సో మరో బాలీవుడ్ హీరోయిన్ పెళ్లికి సిద్ధమయ్యింది. సో స్నేహా ఉల్లాల్ కు మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version