సోలో బ్రతుకే సో బెటరు సోలోగానే వస్తుందా..?

-

సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన సోలో బ్రతుకే సో బెటర్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధం అవుతుంది. నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని అటు థియేటర్లలోనూ, ఇటు ఓటీటీలోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. థియేటర్ అనుభవం కావాలనుకున్నవారు అక్కడ చూసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే ఇంట్లోనే మొబైల్ లో చూసుకోవచ్చని సమాచారం.

ఐతే సెన్సార్ పూర్తి చేసుకున్న దగ్గరి నుండి ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ లో క్రిస్ట్ మస్ సందర్భంగా సోలో బ్రతుకే సో బెటరు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చూస్తున్నారు. 50శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లకి అనుమతులు ఇచ్చినప్పటికీ ఇంకా సినిమాలేవీ విడుదల కావడం లేదు.

ఐతే డిసెంబర్ ఆఖరు వారం వరకి 100శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతులు లభిస్తాయని చిత్రబృందం ఆశిస్తోంది. అందువల్ల అందరికంటే ముందుగానే ఆ స్లాట్ బుక్ చేసుకుని పెట్టుకోవాలని భావిస్తోందట. ఒకవేళ అదే గనక నిజమైతే డిసెంబరులో రిలీజ్ అయ్యే సినిమా అదొక్కటే అవుతుందేమో..!

Read more RELATED
Recommended to you

Latest news