శంకర్, రజిని లాంటి క్రేజీ కాంబినేషన్ లో ఈ ఇయర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా వచ్చిన సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా వచ్చిన ఈ సినిమా లో యంతరపు దేశపు సుందరివే సాంగ్ ఒకటి ఉంది. ఆ సాంగ్ సినిమా అంతా పూర్తయ్యాక టైటిల్స్ పడుతున్న టైంలో వస్తుంది. ఆ సాంగ్ కోసం 20 కోట్ల దాకా ఖర్చు పెట్టారట. అలాంటి భారీ బడ్జెట్ సాంగ్ ను అందరు లేచి వెళ్లేప్పుడు పెట్టడం ఆశ్చర్యకరం.
సినిమాలో సాంగ్ ఇరికించినట్టు ఉండకూదన్న ప్లాన్ తో శంకర్ ఆ సాంగ్ చివరన పెట్టాడు. కాని సాంగ్ కు అయిన ఖర్చు ఎక్కువ కాబట్టి ప్రేక్షకుల కోరిక మేరకు ఆ సాంగ్ ను సినిమా మధ్యలోకి తెస్తున్నారట. సెకండ్ హాఫ్ లో ఆ సాంగ్ పెట్టారట. ఎప్పుడైతే చిట్టి, వెన్నెల ఇద్దరు క్లోజ్ అవుతారో అప్పుడు ఈ సాంగ్ వస్తుందట. మొత్తానికి శంకర్ కెరియర్ లో మొదటిసారి రిలీజ్ చేసిన సినిమాను రీ ఎడిట్ చేసి వదలాల్సి వచ్చింది.
భారీ బడ్జెట్ సినిమా కాబట్టి సినిమాకు ఆమాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిందే. చివర ఉన్న సాంగ్ మధ్యలో యాడ్ చేశారట. రేపటి నుండి 2.ఓ మధ్యలోనే యంతరపు దేశపు సాంగ్ వస్తుందట. మరి ఈ సాంగ్ వల్ల సినిమాకు ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.