ప్రముఖ సిని నటుడైన సోనుసూద్ త్వరలో రచయితగా మారబోతున్నాడు. లాక్ డౌన్ సమయంలో వలస కూలీలకు తన వంతు ఎంతో సహాయం చేసి రియల్ హీరోగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో పనులు కోల్పోయిన వలస కూలీలు వారి స్వస్థలాలకు చేరేందుకు ప్రత్యేకమైన బస్సులు, రైళ్లు, విమానాల టికెట్స్ ఏర్పాటు చేసి వారికి ఎంతో సహకరించాడు. వీటితో పాటు తాజాగా పంజాబ్ రాష్ట్రంలో ఓ వైద్య బృందానికి పీపీఈ కిట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారితో ప్రయాణం చేయడం ద్వారా వారిపై నేను బుక్ రాయాలనిపించిందని తెలిపారు. అంతటితో వెంటనే తాను బుక్ రాయడం మొదలు పెట్టానని, ఆ పుస్తకానికి ” లైఫ్ చేంజింగ్ ” అని పేరును కూడా నామకరణం చేసినట్లు తెలిపాడు. ఇక ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ద్వారా ప్రచురించబడుతుందని సోను సూద్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.
View this post on Instagram
मुझे छाँव में रखा ख़ुद चलता रहा धूप में। मैंने देखा एक फ़रिश्ता मेरे पिता के रूप में। ❣️