కరోనా విజృంభన వచ్చినప్పటి నుంచి మన దేశంలో వినిపిస్తున్న ఒకే ఒక్కపేరు సోనూసూద్ . ఎంతో మందికి ఈ ఆపద కాలంలో ఆయన అండగా నిలుస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు ఆయన ఎన్నో రకాలుగా సాయం అందిస్తున్నారు. అడిగింది లేదనకుండా ఆదుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఆయన నేషనల్ రియల్ హీరోగా మారిపోయారు.
ఇదిలా ఉంటే ఓ నెటిజన్ సోనూసూద్‌ను వింత కోరిక కోరాడు. తన గర్ల్ ఫ్రెండ్‌కి ఐఫోన్ కొనివ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఇక దీనికి సోనూసూద్ ఘాటైన రిప్లై ఇచ్చారు. ఆ విషయం నాకు తెలియదు గానీ మీ గర్ల్ ఫ్రెండ్‌కి నేను ఐ ఫోన్ కొనిస్తే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పాడు.
అంతే ఇక దీనిపై కామెంట్లు వరదల్లా వస్తున్నాయి. కొందరికి ఎలాంటి సాయం అడగాలో కూడా తెలియదా అంటూ చురకలంటిస్తున్నారు. సోనూసూద్ పేదోళ్ల కోసం సాయం చేస్తుంటే ఇలాంటి కోరికలు కోరడమేంటని ట్రోల్ చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేసేందుకు సోనూ ప్రయత్నిస్తుంటే ఇలాంటి వాటితో ఆయన టైమ్ వేస్ట్ చేయొద్దని సూచిస్తున్నారు.