చంద్రబాబుపై సోనూసూద్ షాకింగ్ కామెంట్స్..

ఇండియా మొత్తం రియ‌ల్ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నారు బాలీవుడ్ స్టార్ సోనూసూద్‌. ప్ర‌స్తుతం సోనూసూద్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ క‌రోనా సెకండ్‌వేవ్‌లో ఎంతో మందికి త‌న సాయం అందిస్తూ ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ఇప్ప‌టికే ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తానంటూ చెప్పి అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నాడు ఈ రియ‌ల్ హీరో. రీల్ లైఫ్ లో విల‌న్ అయినా.. రియ‌ల్ లైఫ్ హీరోగా జ‌నాల గుండెల్లో నిలిచిపోయారు. ఆయ‌న చేస్తున్న సేవ‌ల‌కు ప్ర‌జ‌ల్లో ఎంతో ఫేమ‌స్ అయిపోయారు. అయితే తాజాగా ఆయన టిడిపి అధినేత చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై నారా చంద్రబాబు నాయుడు శనివారం రోజున వర్చువల్ సమావేశం నిర్వహించారు.

sonu sood
sonu sood

అయితే ఈ సమావేశంలో బాలీవుడ్ స్టార్ సోనూసూద్ తో పాటు వివిధ రంగాల నిపుణులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను తాను ప్రత్యక్షంగా చూశానని సోనుసూద్ చెప్పుకొచ్చారు. పోరాటంలో మా ఇద్దరి ఆలోచనలు కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండో ఇల్లు లాంటివి అని, తన భార్య కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కావడంతో తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకు ఇతర రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాలతో ఎక్కువ ఆత్మీయ అనుబంధం ఏర్పడిందన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు చేస్తున్న సేవలు చాలా గొప్పవని పేర్కొన్నారు.