కరోనాతో ఇద్దరు మావోలు మృతి.. అధికారిక లేఖ విడుదల

వరంగల్ : తెలంగాణ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కేంద్రకమిటీ సభ్యులు అరిభూషన్ హలియాస్ యాపా నారాయణ మరియు దండకారణ్యంలోని మాడ్ డివిజన్ ఇంద్రవతీ ఏరియా సభ్యురాలు సిధ్ధబోయిన సారక్క అలియాస్ భరతక్క ఇరువురి కరోనాతో మృతి చెందినట్లు లేఖలో పేర్కొన్నారు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్. జూన్ 21న ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచారని… జూన్ 22 న అంత్యక్రియలు ప్రజల మధ్యనే పూర్తి చేశామని.. శ్రద్ధాంజలి ఘటించామని అధికార ప్రతినిధి జగన్ లేఖలో వెల్లడించారు.

హరిభూషన్ , భరతక్కల కుటుంబ సభ్యులకు మావోస్టు పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. మావోయిస్టులను మట్టికరిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటిలా ప్రయత్నం చేశాయని ప్రతినిధి జగన్ ఫైర్ అయ్యారు. ఎన్ని శక్తులు అడ్డు వచ్చినా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫ్యల్యాలను ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు జగన్.