సోనూసూద్‌కు ప‌ద్మ‌విభూష‌న్ ఇవ్వాల్సిందే.. ట్విట్ట‌ర్‌లో రీట్వీట్ల సునామీ!

ఈ క‌రోనా వ‌చ్చిన‌ప్పటి నుంచి దేశ ప్ర‌జ‌లు బాగా త‌లుచుకుంటున్న పేరు సోనూసూద్‌. ఆయ‌న చేస్తున్న సేవ‌లు దేశవ్యాప్తంగా కోట్లాదిమందికి చేరుతున్నాయి. వ‌ల‌స కూలీల‌ను వారి ఇంటికి పంపించ‌డం ద‌గ్గ‌రి నుంచి మొద‌లు పెడితే ఆక్సిజ‌న్ అందించ‌డం వ‌ర‌కు ఆయ‌న చేయ‌ని సేవ‌లే లేవు. అన్ని ర‌కాల సేవ‌ల్లో ఆయ‌న‌పాలు పంచుకుంటున్నారు. ఎవ‌రు ఏది అడిగినా కాద‌న‌కుండా ఇస్తున్నారు. ఈ కార‌ణాలే ఆయ‌న్ను రియ‌ల్ హీరోగా నిల‌బెట్టాయి.

 

ఈ క‌రోనా సెకండ్ వేవ్‌వ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న పేరు మ‌రింత‌గా మార్మోగిపోతోంది. ఇక ఇప్పుడు 2022 ఏడాదికి గాను పద్మ అవార్డులకు కేంద్రం నామినేషన్లు స్వీక‌రిస్తోంది. వచ్చే ఏడాది రిపబ్లిక్ రోజున వీటిని అంద‌జేయ‌నుంది. ఇందుకోసం ఆయారంగాల్లో సేవ చేస్తున్న వారిని సిఫార‌సు చేయాన‌లి సెప్టెంబర్ రెండోవారం వరకు గడువు ఇచ్చింది.

ఈ క్ర‌మంలోనే సోనూసూద్‌కు ప‌ద్మ విభూష‌న్ అవార్డు ఇవ్వాలంటూ టాలీవుడ్ న‌టుడు బ్ర‌హ్మాజీ రీసెంట్‌గా ట్వీట్ చేశారు. అంతే కాదు ఆయ‌న‌కు స‌పోర్టు చేసేవారు పద్మవిభూషణ్ ఫర్ సోనూసూద్ అనే హ్యాష్ న పోస్టు చేస్తూ దీనికి రీట్వీట్ ఇవ్వాలని బ్ర‌హ్మాజీ కోరాడు. అంతే ఇక వేలాది ట్వీట్లు వ‌చ్చి చేరుతున్నాయి. ఆయ‌న‌కు అవార్డు ఇవ్వాల్సిందేనంటూ కోరుతున్నారు. అయితే దీనిపై సోనూసూద్ స్పందించారు. త‌న‌కు 135 కోట్ల మంది అభిమ‌నాలు, ప్రేమ ఉంద‌ని, అదే త‌న‌కు పెద్ద అవార్డు అని చెప్పారు. మ‌రి సోనూకు అవార్డు ఇస్తారా లేదా చూడాలి.