టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ శ్రీకృష్ణులు… ఎన్టీఆర్ టు పవన్ కల్యాణ్‌ వరకు..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెరపై శ్రీ‌కృష్ణుడు  అంటే  వెంటనే గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్. కృష్ణుడంటే ఇలానే ఉంటాడేమో.. అనేలా చెదరని ముద్ర వేశారు. ఇక రామారావు కంటే ముందే.. ఆయన తరువాత కూడా చాలా మంది టాలీవుడ్ స్టార్స్ కృష్ణులుగా మెప్పించారు. ఈ కష్ణాష్టమి సందర్భంగా మరి వారెవరో చూసేద్దాం

ఎన్టీఆర్ అంటే  మ‌నంద‌రికీ ఠ‌క్కున గుర్తుకొచ్చే రూపం రామారావుదే. ఆయన తరువాత చాలా మంది ఆపాత్రలో మెప్పించారు కాని. రామారవు చేసినంతగా ఎవరూ చేయలేకపోయారు. దాదాపు 18 సినిమాల్లో కృష్ణుడిగా నటించి మెప్పించారు.

సీనియర్ఎన్టీఆర్
సీనియర్ఎన్టీఆర్

కృష్ణుడంటే ఎన్టీఆర్ అనే అనుకుంటారు చాలా మంది. కాని ఎన్టీఆర్ కంటే ముందు కృష్ణుడి పాత్రల్లో, మహావిష్ణు పాత్రలతో మెప్పించారు రామకృష్ణ. య‌శోద కృష్ణ సినిమాలో  శ్రీ‌కృష్ణుడి పాత్ర‌లో న‌టించి పెప్పించిన ఆయన.. తన ఫిల్మ్ కెరీర్ లో ఎక్కువగా  ఇలాంటి పాత్రలనే పోషించారు.

రామకృష్ణ
రామకృష్ణ

రామారావు, రామకృష్ణ తరువాత కృష్ణుడిగా ఆ స్థాయిలో మెప్పించగలిగింది కాంతారావు మాత్రమే. జానపథ సినిమాలకు పెట్టింది పేరు కాంతారావు. కత్తి యుద్దాలతో బాగా ఫేమస్ అయిన ఈయన కృష్టుడిగా కూడా కొన్ని సినిమాలలో నటించి మెప్పించారు. త‌న‌దైన శైలిలో ఆ పాత్ర‌కే వ‌న్నె తీసుకొచ్చారు.

కాంతారావు
కాంతారావు

 

పేరుకి కృష్ణుడే కాని.. పాత్రల విషయానికి వస్తే.. సూపర్ స్టార్ కృష్ణ ఎక్కువగా కృష్ణుడి వేశాలు వేయలేదు. ఒకే ఒక్క సారి  బాపు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సాక్షి సినిమాలో మాత్రం  సూప‌ర్ స్టార్ కృష్ణ  శ్రీ‌కృష్ణుడిగా క‌నిపించారు.  అది కూడా కాసేపు మాత్రమే.

సూప‌ర్ స్టార్ కృష్ణ
సూప‌ర్ స్టార్ కృష్ణ

తెలుగు తెర‌పై శ్రీ‌కృష్ణుడిగా మెప్పించిన హీరోల్లో శోభ‌న్ బాబు కూడా ఉన్నారు అందాల నటుడిగా పేరున్న ఈ స్టార్ హీరో.. బాపు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బుద్ధిమంతుడు సినిమాలో మొద‌టిసారి శ్రీ‌కృష్ణుడి వేషంలో కనిపించారు. ఆతరువాత మాత్రం  క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన  కురుక్షేత్రం మూవీలో ఫుల్ లెన్త్ క్రిష్ణుడి పాత్రలో  కనిపించి అలరించారు.

శోభ‌న్ బాబు
శోభ‌న్ బాబు

ఇక హీరోయిన్లలో కూడా చాలా మంది కృష్ణావతారాలు వేశారు కాని.. అందులో అందరికి గుర్తుండి పోయింది మాత్రం దివంగ‌త శ్రీదేవి మాత్రమే.  అతిలోక‌సుంద‌రిగా తెలుగు ప్రేక్ష‌క హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన శ్రీ‌దేవి య‌శోద కృష్ణ సినిమాలో  బాల్యంలో కృష్ణుడి పాత్రలో కనిపించారు.

దివంగ‌త శ్రీదేవి
దివంగ‌త శ్రీదేవి

ఇక తరం హీరోల్లో కన్నయ్య పాత్రను కొంతమంది పోషించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తరువాత ఆయన వారసత్వం తీసుకుని సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ… రెండు సినిమాల్లో శ్రీ కృష్ణుడిగా మెప్పించారు. శ్రీ‌కృష్ణార్జున విజ‌యం, పాండు రంగ‌డు సినిమాల్లో లో శ్రీ‌కృష్ణుడిగా అద్భఉతంగా నటించారు. తన తండ్రి పేరు నిలబెట్టారు.

బాలకృష్ణ
బాలకృష్ణ

కామెడీ హీరోగా టాలీవుడ్ లో పేరు గాంచిన  స్టార్ రాజేంద్ర ప్రసాద్. ఈయన కూడా కృష్ణావతారంలో అద్భుతంగా పండించారు. రేలంగి న‌ర‌సింహారావు డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన క‌న్న‌య్య కిట్ట‌య్య సినిమాలో.. ఫుల్ లెన్గ్ కృష్ణుడి పాత్రలో  రాజేంద్ర‌ప్ర‌సాద్ అద్భతం చేశారు. ఈ సినిమాలో  శ్రీ‌కృష్ణుడిగా భ‌క్తుడిగా రెండు పాత్ర‌ల్లో ఆయన నటించారు

ఇక ఇప్పటి తారల్లో ఎక్కువగా కృష్ణుడి పాత్రలు ఎవరూ వేయలేదు కాని అప్పుడప్పుడు కొంత మంది మాత్రం కన్నయ్య పాత్రల్లో మెప్పించారు. అందులో తన తండ్రి మాదిరిగానే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక్క సారి.. ఓ చిన్న సందర్భంలో కృష్ణుడిగా కనిపించారు. యువ‌రాజు సినిమాలో ఒక పాట‌లో శ్రీ‌కృష్ణుడిగా క‌నువిందు చేసారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెంకటేష్ తో కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ  గోపాల గోపాల సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మోడ్రన్  కృష్ణుడిగా క‌నిపించాడరు. అన్ని సినిమాల్లో ఒక రకంగా ఈ సినిమాలో మరో రకంగా కనిపించి అలరించారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్