ఇద్దరు వ్యక్తులు ఒకటిగా మారి ప్రేమను పంచుకునే ప్రక్రియ శృంగారం. నచ్చిన వ్యక్తులతో సెక్స్ లో పాల్గొంటే వచ్చే తృప్తి మాటల్లో వర్ణించలేనిది. అయితే రోజులో ఎన్నిసార్లు శృంగారం చేయొచ్చు అనేది చాలా మందికి వచ్చే సందేహం. ఎక్కువ సార్లు పాల్గొంటే మంచిది కాదేమోనని కొందరి అనుమానం. అలాగే శృంగార జీవితం హ్యాపీగా సాగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? పగటిపూట శృంగారం చేస్తే పిల్లలు పుట్టరా..? శృంగారంలో చెమట పడితే బలహీనతకు సంకేతమా..? ఈ సందేహాలపై వైద్యనిపుణులు ఏమంటున్నారంటే..?
శృంగారంలో పాల్గొనడానికి పరిమితి అంటూ ఏం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కోరిక, సామర్థ్యం ఉంటే ఎన్నిసార్లైనా పాల్గొనవచ్చని అంటున్నారు. ‘కొత్తగా పెళ్లి అయినవారైతే రోజులో మూడు-నాలుగు సార్లు పాల్గొంటుంటారు. నిజంగా మనసు పడి రతిలో పాల్గొంటే దంపతులు పొందే తృప్తి మాటల్లో వర్ణించలేనిది. మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఓపిక ఉంటే ఎన్నిసార్లు అయినా పాల్గొనవచ్చు. సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎవరూ నీరసపడరు. ఇంకా చెప్పాలంటే రతి వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆరోజు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఎందుకంటే సెక్స్ వల్ల ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి.’ అని అంటున్నారు నిపుణులు.
‘శృంగార జీవితం మెరుగయ్యేందుకు సోయా, చేపలు వంటివి తింటే.. సెక్స్ హార్మోన్ల మోతాదులు పెరిగేలా చేస్తాయి.పలుచటి ప్రొటీన్లతో కూడిన కోడి మాంసం వంటి వాటిలో టైరోసైన్, ఫినైల్ అలనైన్ ఉంటాయి. ఇవి శృంగారాసక్తి పెరిగేలా చేస్తాయి. తక్కువ కొవ్వు గల పెరుగు, గుడ్ల వంటివాటిలో కొలైన్ ఉంటుంది. శృంగార కాంక్షను నియంత్రించే రసాయనానికి ముందు రూపం ఇదే. పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, ఎక్కువ పీచుతో కూడిన పదార్థాల్లో గ్లుటమైన్, ఐనోసిటాల్ ఉంటాయి. భావప్రాప్తికి చేరుకునే దశలో స్థిమితంగా ఉండటానికి తోడ్పడే రసాయనం వీటి నుంచే పుట్టుకొస్తుంది.’ అని నిపుణులు చెబుతున్నారు.
‘పిల్లలు పుట్టాలంటే ఏ సమయంలో సెక్స్ చేయాలి? గర్భధారణకు పగలు సరైన సమయమేనా? పగలు చేస్తే పుట్టే పిల్లల్లో లోపాలు ఏర్పడతాయా?.. కొందరి అనుమానాలివి. ఇవన్నీ అపోహలే. రతికి ఓ సమయం అంటూ ఏదీ లేదు. వారికి నచ్చినప్పుడు, ఏ సమయంలోనైనా శృంగారంలో పాల్గొనవచ్చు. పగటిపూట రతి చేస్తే.. సంతానంలో అవలక్షణాలు రావడమనేది భ్రమ మాత్రమే.
ఒకే రాత్రి రెండోసారి రతి చేస్తే మహిళలు గర్భం దాల్చేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని’ పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
‘కలయిక వేళ ఒళ్లంతా చెమటలు పట్టడం నరాల బలహీనత అని, శృంగారంపై ప్రభావం చూపుతుందని కొందరు భయపడుతుంటారు. అయితే, చెమట ఎక్కువగా వస్తే నరాల బలహీనత అనుకోవడం అపోహ మాత్రమే. నరాల బలహీనతకు, రతికి అస్సలు సంబంధం లేదు, కంగారు, ఆందోళన, హైపర్ థైరాయిడ్ ఉన్నవాళ్లకు ఎక్కువగా చెమట పడుతుంది. కొందరికి సహజంగానే అలా జరుగుతుంది.చెమట ఎక్కువగా వచ్చే వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.’ అని సెక్సాలజిస్ట్ లు సూచిస్తున్నారు.