‘భగవంత్ కేసరి’ ట్రైలర్ లాంఛ్​లో శ్రీలీల ఎమోషనల్.. ఆ విషయం గుర్తుచేసుకుని కంటతడి

-

టాలీవుడ్ మోస్ట్ హాప్పెనింగ్ హీరోయిన్ శ్రీలీల తాజాగా ఓ వేదికపై కంటతడి పెట్టింది. తన లైఫ్​లో మిస్ అయిన అనుభూతిని నందమూరి బాలకృష్ణ ఫీల్ అయ్యేలా చేశారంటూ ఎమోషనల్ అయింది. బాలయ్య హీరోగా.. కాజల్ హీరోయిన్​గా.. శ్రీలీల ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్​లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ట్రైలర్ ఈవెంట్​ను వరంగల్​లో గ్రాండ్​గా నిర్వహించారు. ట్రైలర్​లో బాలయ్యతో పాటు శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. బాలయ్య ఎంత పవర్​ఫుల్​గా కనిపించారో.. శ్రీలీల అంతే ఎనర్జీతో పాటు ఎమోషనల్​గా కనిపించింది. సినిమాలో ‘విజ్జి పాప’గా శ్రీలీల కనిపించింది.

ట్రైలర్ లాంఛ్​ ఈవెంట్​లో శ్రీలీల మాట్లాడుతూ ఎమోషనల్ అవతూ.. స్టేజ్​పైనే లైట్​గా కన్నీళ్లు పెట్టుకుంది. షూటింగ్ సమయంలో చిత్రబృందంతో తనకు ఏర్పడిన బంధం గురించి గుర్తుచేసుకుంది. మూవీ టీమ్​కు ధన్యవాదాలు చెబుతూ.. ఈ సినిమాలో సోల్​ కనెక్ట్ అ్యయే క్యారెక్టర్కి ఇచ్చిన అనిల్ రావిపూడికి స్పెషల్​ థ్యాంక్స్ చెప్పింది​. విజ్జి పాత్రకు తాను చాలా బాగా ఎమోషనల్​గా కనెక్ట్ అయ్యానని.. ఈ పాత్ర చేసినందుకు అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. సినిమా లాస్ట్ సీన్​ కట్​ చెప్పాక అందులో నుంచి బయటకు రాలేకపోయానని.. తన లైఫ్​లో ఏ అనుభూతిని అయితే పొందలేదో ఆ అనుభూతిని ఈ సినిమా ద్వారా బాలయ్య బాబు అందించారని శ్రీలీల ఎమోషనల్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news