టాలీవుడ్‌లో శ్రీముఖి అంటే పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెర స్టార్ యాంకర్‌గా ప్రస్తుతం ఆమె దూసుకుపోతోంది. ఇంకోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పటాస్ షోతో తన కెరీర్ మొదలు పెట్టిన ఈ భామ.. ప్రస్తుతం స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ తర్వాత ఈమె స్టార్ పెరిగిందని చెప్పవచ్చు. అక్కడి నుంచే అమాంతం ఫాలోయింగ్ పెరిగింది ఈ హాట్ యాంకర్‌కు అని చెప్పాలి.
ఇక ఈమె బిగ్‌బాస్ షోలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈమెనే గెలుస్తుందని అంతా అనుకున్నా చివరకు సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. కాకపోతే తన ట్యాలెంట్‌తో ఇప్పుడు సుమకు పోటీగా ప్రోగ్రామ్‌లో చేస్తూ ఆడియో ఫంక్షన్లుకూడా నిర్వహిస్తోంది.
ఇక అటు సినిమాల్లో కూడా మెరుస్తూ తన క్రేజ్‌ను కొనసాగిస్తోంది. రీసెంట్‌గా శేఖర్ మాస్టర్‌కు స్టేజిమీదనే ముద్దులు ఇచ్చి అందరి దృష్టిలో శ్రీముఖి హాట్ టాపిక్‌గా మారింది. ఇలా ఏదో విషయంతో జనాలకు దగ్గరవుతోంది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. లేటెస్టుగా షేర్ చేసిన ఫొటోలుమీరూ చూడండి.