చందమామను తలపిస్తున్న శ్రీముఖి అందం.. ఫొటోలు వైరల్

-

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి.. పరిచయం అక్కర్లేని పేరు. ఈ బ్యూటీ ఓవైపు బుల్లితెర.. మరోవైపు వెండితెరపై కనిపిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం తన మెయిన్ ఫోకస్ అంతా టీవీపైనే పెట్టిన శ్రీముఖి.. ఏ ఛానెల్ పెట్టినా తానే కనిపించే అంతలా బిజీ అయిపోయింది. యాంకర్​గా పీక్ స్టేజ్​లో ఉంది. ఈవెంట్లు.. రియాల్టీ షోలకు హోస్టుగా వ్యవహరిస్తోంది.

ఈ భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్​గా ఉంటుంది. తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఫొటోషూట్స్​కైతే లెక్కే లేదు. ఈ బ్యూటీ డ్రెస్సింగ్ స్టైల్​కు చాలా మంది అమ్మాయిలు ఫిదా అవుతుంటారు. తాజాగా శ్రీముఖి ట్రెడిషనల్ వేర్​లో ఆకట్టుకుంది. కృష్ణాష్టమి సందర్భంగా ట్రెడిషనల్ వేర్​లో కనిపించి ఫిదా చేసింది. చోళీ లెహంగా ధరించి నిండుగా కనిపించింది.

ఆమె అందానికి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. అయిపోయిందనే చెప్పాలి. చందమామ అమ్మాయిగా మారితే బహుశ శ్రీముఖిలా ఉంటుందేమోనని సోషల్​ మీడియా యూజర్స్ అభివర్ణిస్తున్నారు. ఎంత ముద్దొస్తున్నావో శ్రీ అంటూ కుర్రాళ్లు కొంటె కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news