టాలీవుడ్ సూపర్ హిట్ ప్రొడ్యూసర్, ఎస్పీ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు రెండో తనయుడు అభిరామ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. తేజ దర్శకత్వంలో అహింస మూవీతో అభి టాలీవుడ్ లో అరంగేట్రం చేశాడు. ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గీతికా హీరోయిన్‌గా నటిస్తోంది.
అయితే ఈ సినిమా నిన్న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా జనాలకు పెద్దగా ఎక్కలేదని తెలుస్తోంది. స్టోరీ నచ్చకపోవడంతో ఈ సినిమా చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ తరుణంలోనే టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. అహింస సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అహింస సినిమా అట్టర్ ప్లాప్ అయిందంటూ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. హింసతో మమ్మల్ని చంపకండి అంటూ… హీరో అభిరామ్ ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేసింది. తేజ డైరెక్షన్ అస్సలు బాగా లేదంటూ మండిపడింది శ్రీ రెడ్డి.