SSMB -28 చిత్రంలో శ్రీలీల పాత్ర ఆ హీరోయిన్ దేనా..?

-

తమిళ హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే ఈ అమ్మడు నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది అయినప్పటికీ ఈమెకు ఆశించిన స్థాయిలో తెలుగులో అవకాశాలు రాలేకపోయింది. శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమాలో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

కానీ మాతృభాష అయిన తమిళంలో మాత్రం ప్రియాంకకు మంచి అవకాశాలు వెలువడుతూనే ఉన్నాయి.. అలా శివ కార్తికేయ నటించిన డాక్టర్ సినిమాలో హీరోయిన్గా నటించి.. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.. ఆ తరువాత నటుడు సూర్యతో కలిసి ఈటి చిత్రంలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ వెంటనే నటుడు శివ కార్తికేయన్ తో మళ్లీ డాన్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ అనే చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇన్ని సినిమాలు చేస్తున్న సమయంలోనే కాస్త గ్యాప్ వచ్చిందంటే చాలు ఫోటోషూట్లతో అలరిస్తూ ఉంటుంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్ కు మొదట మహేష్ బాబు నటిస్తున్న 28వ సినిమాలో ఈమెకు అవకాశం వచ్చిందట . కానీ ఆ సినిమాని నిరాకరించడంతో ఈ ఆఫర్ మరొక హీరోయిన్ అయిన శ్రీలీలకు వెళ్లిందనే కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయాన్ని కూడా ప్రియాంక అరుణ్ మోహన్ తెలియజేసినట్లు తెలుస్తోంది. ప్రియాంక అరుణ్ మోహన్ ఈ సినిమాని ఎందుకు రిజెక్ట్ చేసిందనే విషయంపై అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version