ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఏదైనా సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు అంటే కచ్చితంగా ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని నమ్మకం కూడా ప్రేక్షకులలో ఉంటుంది. ఇక అందుకే వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోలతో మంచి స్టార్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు శ్రీనువైట్ల. ఇకపోతే గత కొద్దికాలం నుండి ఆయనకు సరైన హిట్టు పడకపోవడంతో ఇండస్ట్రీలో కొంచెం వెనుకడుగు వేస్తున్నాడు. ఇక ఆయన సినీ ఇండస్ట్రీలో వెనుకడుగు వేసినట్టే తన వైవాహిక జీవితంలో కూడా పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని వార్తలు బాగా వైరల్ గా మారుతున్నాయి.
తాను ఎంతో ఇష్టపడి పెద్దల సహకారంతో వివాహం చేసుకున్న అమ్మాయికి ప్రస్తుతం విడాకులు ఇవ్వబోతున్నాడు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక శ్రీను వైట్ల భార్య రూపావైట్లతో నాంపల్లి కోర్టు లో విడాకులు తీసుకోవడానికి పిటిషన్ వేసినట్లు ఒక వార్త బాగా హల్చల్ చేస్తోంది. ఇండస్ట్రీలో నీకోసం అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయమైన శ్రీనువైట్ల తన కెరియర్ లో మంచి మంచి సినిమాలను తెరకెక్కించాడు. కేవలం దర్శకుడు మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది స్టార్ హీరోలకు జాన్ జిగిడీ దోస్త్ కూడా.ఇకపోతే ఇంతటి గొప్ప దర్శకుడు విడాకుల తీసుకోబోతున్నాడు అని తెలియగానే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఎందుకు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఆరా తీయగా ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇక శ్రీను బయట ప్రస్తుతం ఒక సో కాల్డ్ హీరోయిన్ తో సీక్రెట్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడట. ఇక ఆమె ఇప్పుడు ఫేడ్ అవుట్ అయినట్లు సమాచారం. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా చాలా రహస్యంగా భార్యకు డౌట్ రాకుండా మెయింటైన్ చేస్తూ వచ్చిన శ్రీనువైట్ల ఆమె కోసం డబ్బులను విపరీతంగా ఖర్చు పెట్టాడట. అంతేకాదు ఆ హీరోయిన్ కోసం తన కట్టుకున్న భార్యను కూడా దూరం పెడుతూ వచ్చాడని సమాచారం. ఇక ఈ క్రమంలోనే విసిగిపోయిన రూపావైట్ల విడాకులు తీసుకోవడానికి సిద్ధమైందనే వార్త బాగా వైరల్ అవుతూ ఉంది. అంతే కాదు ఆ హీరోయిన్ ఎవరో కాదు ఒక సందర్భంలో శ్రీను వైట్ల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ అని సమాచారం.