ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. అయితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప-2’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఓ బంగ్లా సెట్ లో షూటింగ్ జరుగుతుండగా… హీరోయిన్ రష్మిక మందన షూటింగ్ స్పాట్ ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇప్పటికే షూటింగ్ స్పాట్ లో నిలిపిన లారీల వీడియో లీక్ అవ్వగా… సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.