దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ రానున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో భారత ప్రధాని మోదీ భేటీ కావడానికంటే ముందు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాన్ని తొలగిస్తూ ప్రకటించింది.
2019లో కొన్ని రకాల స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన పన్నుకు ప్రతిస్పందనగా భారత్ సుమారు 28 ఉత్పత్తులపై ఈ అదనపు పన్నులు విధించింది. అయితే తాజాగా వాటిలో కొన్నింటికి మినహాయింపు ఇచ్చింది. అదనపు సుంకాలు ఎత్తివేసిన అమెరికాకు చెందిన వస్తువులలో శనిగలు, ఉలవలు, ఆపిల్స్, వాల్నట్స్, బాదాం ఉన్నాయి.