టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సీఈవో, నిర్మాత చెర్రీ కుమార్తె వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న రాజమౌళి తన సతీమణి రమతో డ్యాన్స్ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ప్రభుదేవా ఆల్‌టైమ్ హిట్స్‌లో ఒకటైన ‘అందమైన ప్రేమరాణి’ పాటకు వీరిద్దరూ స్టెప్పులేశారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన రిహార్సల్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాజమౌళి-రమ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న క్లిప్‌ను చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. క్యూట్ కపుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే రాజమౌళి.. మాంచి కళాపోషకుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో చేయనున్న ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగం కానున్నారు.
.@ssrajamouli and wife #RamaRajamouli rehearsals for the dance performance. 😁👌#SSRajamouli pic.twitter.com/609m1Nr4c5
— Suresh PRO (@SureshPRO_) April 11, 2024