‘కల్కి’ టీమ్ పై రాజమౌళి ప్రశంసలు.. కానీ ఆ ఒక్క డౌట్ ఉందంటూ

-

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పాన్ ఇండియా ప్రభాస్ సినిమా కల్కి 2898 ఏడీ గురించే. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఈ చిత్రం గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. సినీ ప్రముఖులు కూడా ఈ మూవీపై తమ అంచనాల గురించి ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు. ఇటీవలే అమెరికాలోని  ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ వేదికగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేశారు.

ఈ మూవీ టీజర్ గ్లింప్స్ చూసిన దర్శకధీరుడు రాజమౌళి తాజాగా కల్కి టీమ్ పై ప్రశంసలు కురిపించారు.  గ్రేట్‌ జాబ్‌ అంటూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ని కొనియాడారు. ఇలాంటి సినిమాలు తీయడం పెద్ద టాస్క్ అని.. అయినా మీరు సాధించగలిగారని అన్నారు.  డార్లింగ్‌ (ప్రభాస్‌) లుక్స్‌ అదుర్స్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. “ఇదంతా చూశాక నాకు ఒక్క డౌట్ మాత్రం ఉందంటూ.. ఇంతకీ సినిమా రిలీజ్‌ డేట్‌ ఎప్పుడు’’ అని రాజమౌళి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version