‘డాన్స్ ఇండియా డాన్స్’ షోకు మహేష్‌, సితార..ప్రోమో రిలీజ్‌

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ ..నెక్స్ట్ ఫిల్మ్ షూట్ విషయమై మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు.

ఇది ఇలా ఉండగా.. తాజాగా తొలిసారిగా తన కూతురు సితార తో కలిసి.. జీ తెలుగు ఛానల్‌ లో ప్రసారం అవుతున్న డాన్స్‌ ఇండియా డాన్స్‌ షోకు స్పెషల్‌ గెస్ట్‌ గా రానున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్‌ అయింది.

కాగా.. ఈ ప్రోమోలో మహేష్‌ బాబు, సితార మెరిసారు. తనకు తెలిసినంత వరకు డాన్స్‌ అనేది ఒక సెలబ్రేషన్‌ అని అలానే తన కూతురు సితారతో కలిసి ఈ షోకు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మహేష్‌ పేర్కొన్నారు. కాగా. ఈ షో ఫుల్‌ ఎపిసోడ్‌ సెప్టెంబర్‌ 4వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news