ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రెండు లక్షల ఇన్సూరెన్స్ మరియు ఎన్నో ఆఫర్లు..!

-

ఐసీఐసీఐ బ్యాంకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో కలిసి కొత్త రూపే కార్డును మార్కెట్ లోకి తీసుకు వచ్చింది. కోరల్ రూపే క్రెడిట్ పేరుతో దీన్ని తీసుకొచ్చారు. పూర్తి వివరాల లోకి వెళితే.. షాపింగ్, రెస్టారెంట్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ మొదలైన వాటి కోసం ఈ కార్డును వాడచ్చు.

 

 

ట్రాన్సక్షన్స్ పై కష్టమర్లకు రివార్డు పాయింట్లను ఐసీఐసీఐ ఇస్తోంది. రూ.100 కొనుగోలుపై రెండు రివార్డు పాయింట్స్ వస్తాయి. అయితే ఈ కోరల్ రూపే క్రెడిట్ కార్డ్స్ వచ్చాక రుబిక్స్, సప్ఫీరో వెర్షన్లను తీసుకు వస్తామని చెప్పింది ఐసీఐసీఐ బ్యాంకు. ఈ కొత్త కార్డు కస్టమర్స్ కి బాగా ఉపయోగ పడుతుంది. ఈ కోరల్ రూపే కార్డు తీసుకుంటే ఉచితంగా రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా వస్తుంది.

అలానే పెట్రోల్ బంకుల్లో పేమెంట్లు ఈ కార్డు తో చేస్తే ఎలాంటి సర్‌ఛార్జ్ ఉండదు. దేశీయ విమానశ్రయాల్లో మరియు కొన్ని రైల్వే స్టేషన్లలో లాంజ్ సదుపాయం కూడా. ఈ కార్డుతో బుక్ మై షోలో టిక్కెట్లను బుక్ చేస్తే డిస్కౌంట్ కూడా. ఈ కార్డు ద్వారా ఏడాదికి రూ.2 లక్షల ట్రాన్సక్షన్స్ చేస్తే రెండు వేల బోనస్ రివార్డు పాయింట్లు పొందొచ్చు. అంతే కాక్ లక్ష కొనుగోలుకు 1000 బోనస్ రివార్డు పాయింట్లు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news