‘టిల్లు క్యూబ్’ సినిమాలో మరో స్టార్ హీరో!

-

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్వ్కేర్ సక్సెస్ తో జోష్ లో ఉన్నాడు. 2022లో రిలీజైన ‘డీజే టిల్లు’కు సీక్వెల్​గా తెరకెక్కిన ‘టిల్లు స్వ్కేర్’ మార్చి 29వ తేదీన విడుదలై భారీ విజయం సొంతం చేసుకుంది. హీరో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకు స్క్రిప్టు అందించగా, దర్శకుడు మల్లిక్ రామ్ రొమాంటిక్ డ్రామాగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు మూడో పార్ట్ ‘టిల్లు క్యూబ్’ కూడా ఉంటుందని పార్ట్-2లో హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

తొలి రెండు భాగాల కంటే ‘టిల్లు క్యూబ్’పై కూడా అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి.  తాజాగా సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సిద్ధుతో పాటు మరో స్టార్ హీరో కూడా నటించనున్నాడట. సినిమా మూడో భాగం కోసం స్క్రిప్ట్​ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయట. ఇందులో నటించనున్న స్టార్ హీరోకు మంచి పాత్ర రెడీ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ హీరో ఎవరన్న విషయం ఇప్పటికైతే తెలియదు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news