చంద్రగిరిలో కొనసాగుతున్న 144 సెక్షన్..ఏకంగా 71 మంది !

-

 

Section 144 continued in Chandragiri: తిరుపతి పరిధిలోని చంద్రగిరిలో 144 సెక్షన్..కొనసాగుతోంది. పోలింగ్ తర్వాత అలర్ల ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 8కు ప్తెగా కేసులు నమోదు చేసినట్లు సమాచారం అందుతోంది. ఇరు పార్టీలలో 71 మందికి పైగా ముద్దాయిలను గుర్తించిన పోలీసులు….ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

Section 144 continued in Chandragiri

పోలింగ్ రోజు బ్రాహ్మణ కాల్వలో 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు బిఎస్ఎఫ్ జవాన్. మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర గన్ మాన్ 2 రెండ్లు కాల్పులు జరిపారు. అటు నేతల ఇళ్ల వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. అరెస్ట్ ల భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు కొందరు వ్తెసీపీ, టిడిపి కార్యకర్తలు. సిఐ పై దాడి ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. తిరుపతి రూరల్ – 2 కేసులు 20 మందిపైన చంద్రగిరిలో 4 కేసులు 43 మంది పైన పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news