‘ది వ్యాక్సిన్‌ వార్‌’ మూవీ హార్ట్ టచింగ్ గా ఉంది.. సుధా మూర్తి రివ్యూ

-

ది కశ్మీర్ ఫైల్స్ సెన్సేషనల్ డైరెక్టర్ వివేక్‌ అగ్నిహోత్రి లేటెస్ట్ మూవీ ‘ది వ్యాక్సిన్ వార్’. సెప్టెంబర్‌ 28వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో కొంతమంది ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి, రచయిత్రి సుధామూర్తి  ఈ కూడా ఈ సినిమాను వీక్షించారు.

అనంతరం ఈ సినిమా గురించి మాట్లాడారు. సినిమా హృదయాన్ని హత్తుకుందని ప్రశంసించారు. మహిళా సైంటిస్ట్‌ల జీవితాలకు సంబంధించిన ఈ సినిమాలో మంచి మెసేజ్‌ ఉందని చెప్పారు. విజయవంతమైన ప్రతి స్త్రీ వెనుక ఆమెను సపోర్ట్‌ చేసే ఓ పురుషుడు తప్పకుండా ఉంటాడని సుధామూర్తి అన్నారు.

‘‘తల్లిగా, భార్యగా ఓ మహిళ ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే మరోవైపు ఉద్యోగం చేయడం ఎంతో కష్టమైనపని. కానీ, కొందరు ఆడవాళ్లకు కుటుంబం నుంచి ఎంతో సపోర్ట్‌ ఉంటుంది. ఆ విషయంలో వాళ్లు ఎంతో అదృష్టవంతులు. ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ సినిమాలో చిన్నపిల్లలు ఉన్న తల్లులు కూడా వ్యాక్సిన్‌ తయారు చేయడం కోసం ల్యాబ్‌లలోనే వారి జీవితాన్ని ఎలా గడిపారని చూపించారు. ఒక సాధారణ వ్యక్తికి వ్యాక్సిన్ గురించి పూర్తిగా తెలియదు. కానీ, ఈ సినిమా చూశాక దాని గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు. వ్యాక్సిన్‌ తయారు చేయడం కేవలం వాళ్ల ఉద్యోగం మాత్రమే కాదు.. అది సైంటిస్ట్‌లు చేసిన నిస్వార్థమైన సేవ. వాళ్ల సమయాన్ని దేశం కోసం ఉపయోగించారు. ఇది అన్నింటికంటే ముఖ్యమైన విషయం. ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది’’. అని సుధామూర్తి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news