బంపర్ ఆఫర్ కొట్టేసిన సుహాస్.. కీర్తి సురేశ్ తో సినిమా ఛాన్స్

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్తో నటించే ఛాన్స్ కొట్టేశాడు యంగ్ హీరో సుహాస్. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఈ హీరో ఏకంగా మహానటితో నటించబోతున్నాడు. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలతో వరుస హిట్లు అందుకున్న సుహాస్ త్వరలోనే ఉప్పుకప్పురంబు అనే చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించనుంది.

ఐవి శశి తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని ఎల్లనార్ ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధికా లావు నిర్మిస్తున్నారు. వసంత్ మురళీ మరిగంటి కథను అందించనున్నారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం రూపొందిస్తున్నారు. ముంబయి వేదికగా జరిగిన ప్రైమ్ ఈవెంట్లో ఈ ప్రాజెక్టును అఫీషియల్గా ప్రకటించి టైటిల్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమానికి కీర్తి సురేశ్ హాజరు కానప్పటికీ సుహాస్ మాత్రం వేదికపై సందడి చేశారు. ఓ గ్రామంలో స్మశానవాటికలో ఖాళీ స్థలం లేకపోవడంతో ఆ ఊరు ప్రజలు సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎలాంటి పరిష్కార మార్గాలను కనుగొన్నారనేది ఈ సినిమా స్టోరీ లైన్ అని టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version