బీజేపీలో మళ్లీ చేరిన తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై

-

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి ఎల్జీగా రాజీనామా చేశారు. అయితే లోక్సభ ఎన్నికల బరిలో ఆమె నిలుస్తారని సమాచారం. ఈ నేపథ్యంలోనే తాజాగా తమిళిసై బీజేపీలో మళ్లీ చేరారు. కేంద్రమoత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో తమిళిసై సౌందరరాజన్‌ మరోసారి కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక తెలంగాణ గవర్నర్గా రాజీనామా చేసిన ఆమె మంగళవారం రోజున చెన్నైకి వెళ్లిన విషయం తెలిసిందే.

అక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్నందునే తాను గవర్నర్ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. ప్రజా సమస్యలపై సంపూర్ణంగా దృష్టి సారించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. తనకు ప్రజల మధ్య ప్రత్యక్షంగా పని చేయటమే ఇష్టమని పేర్కొన్నారు. విలాసవంతమైన జీవితాన్ని వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వచ్చానంటే ఎందుకనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని తమిళిసై అన్నారు. ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ తరఫున లోక్సభ అభ్యర్థిగా తమిళిసై పోటీ చేయనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version