సుకుమార్, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా

పుష్ప పార్ట్ సూప‌ర్ హిట్ కావ‌డంతో డైరెక్ట‌ర్ సుకుమార్ సెల‌బ్రేష‌న్ మూడ్ లో ఉన్నాడు. అయితే పుష్ప త‌ర్వాత మెగా ప‌వ‌ర్ రామ్ చ‌రణ్ తో సినిమా చేయ‌నున్న‌ట్టు సుకుమార్ తెలిపాడు. అయితే వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో పుష్ప పార్ట్ టూ షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని ఆయ‌న తెలిపారు. దీని త‌ర్వాత రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా ఉంటుంద‌ని తెలిపాడు. అనంత‌రం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో సినిమా ఉంద‌ని అన్నారు.

అయితే రామ్ చర‌ణ్ తో చేయాల్సిన సినిమా కథ చ‌ర్చ‌ల ద‌శ లో ఉంద‌ని అన్నారు. అయితే త‌మ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రావ‌డం ప‌క్క అని తెలిపాడు. అయితే సుకుమార్, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో ఇప్ప‌టికే రంగ‌స్థ‌లం సినిమా వ‌చ్చింది. ఈ సినిమా రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా ఉంది. రామ్ చ‌ర‌ణ్ సినిమా కెరీర్ ను మ‌లిచిన సినిమా కూడా రంగ‌స్థ‌ల‌మే అని చెప్పవ‌చ్చు. అయితే ఆ రెంజ్ లో మ‌రో సినిమా రాబోతుంద‌ని తెలుస్తుంది.