చిత్తూరు జిల్లాలో 17 సినిమా థియేటర్లు మూతపడ్డాయి. మదనపల్లి, కుప్పం, పలమనేరు పుంగనూరులలో నిన్న మధ్యాహ్నం నుంచే షోలు రద్దు కాగా జిల్లా వ్యాప్తంగా 17 సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో మొత్తం 70 థియేటర్ల లైసెన్సులు పునరుద్ధరణ కాలేదని గుర్తించిన అధికారులు… 37 సినిమా థియేటర్లను మూసివే వేయాలని నిన్ననే ఆదేశాలు జారీ చేశారు. దీంతో 17 సినిమా థియేటర్లు మూతపడ్డాయి.
మదనపల్లిలో 7, కుప్పంలో 4, వి కోట 3, బి.కొత్తకోట 2, పీలేరు 4, పుంగనూరు 4, పలమనేరు 4, రొంపిచర్ల 2, కలికిరి 2, సదుం మొలకల చెరువు, గుర్రంకొండ, కలకడ, తంబల్ల పల్లి లలో ఒక్కో థియేటర్లకు నోటీసులు జారీ చేశారు అధికారులు. నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో థియేటర్ల అధినేతలు, ఎగ్జిబిటర్ లతో జిల్లా జాయింట్ కలెక్టర్ రాజా బాబు నిన్న సమావేశమయ్యారు. లైసెన్స్ రెన్యువల్ లేకుండా షోలకు అనుమతి ఇవ్వబోమని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు జెసి. దీంతో ఇవాళ చిత్తూరు జిల్లాలో 17 సినిమా థియేటర్లు మూతపడ్డాయి. మిగతా వాటి పరిస్థితి తెలియాల్సి ఉంది.