యాంకరింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టనున్న సుమ..!

-

బుల్లితెర యాంకర్ అనగానే తెలుగు ప్రేక్షకులకు మొదట గుర్తొచ్చే పేరు సుమ. తెలుగు అమ్మాయి కాకున్నా సరే రాజీవ్ కనకాల భార్యగా, యాంకర్ గా పేరు ప్రఖ్యాతలను సంపాదించింది సుమ. అంతేకాదు వ్యాఖ్యాతగా ఆమె పేరున ఎన్నో రికార్డులు ఉన్నాయి. స్టార్ మహిళ షో ఏకంగా 3వేల ఎపిసోడ్స్ తో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్టార్ మహిళా షో స్థానం సంపాదించుకుంది.

అయితే హఠాత్తుగా ఈ షో నుండి ఆమె తప్పుకుంటున్నట్టు ప్రకటించారు సుమ. గొంతుకి సంబందించిన ఇన్ఫెక్షన్ వల్ల షో నుండి బయటకు రావాల్సి వస్తుందని సుమ ట్వీట్ చేశారు. ప్రస్తుతం క్యాష్ షో చేస్తున్న సుమ అది కూడా ఆపేసే ఆలోచనలో ఉందట. కొన్నాళ్లు రియాలిటీ షోలను ఆపేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈమధ్య స్టార్ సినిమాల ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకలకు సుమ దూరంగా ఉంటూ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version