“సర్కారు వారి పాట” తో రాబోతున్న సూపర్ స్టార్ మహేష్ ..ఇలాంటి టైటిల్ ఎవరైనా ఊహించారా ..?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం ప్రారంభంలోనే మంచి హిట్ సాధించాడు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కి వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత రెండు మూడు సినిమాలనుకున్నప్పటికి కరోనా ఎఫెక్ట్ తో పాటు ఇతర కారణాల వల్ల కార్య రూపం దాల్చలేదు. అయితే ఏ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడో మాత్రం ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి అప్‌డేట్ ఇస్తూ వస్తున్నారు సూపర్ స్టార్.

 

అందులో భాగంగానే మహేష్ బాబు పరశురాం కాంబినేషన్ లో సినిమా మొదలవబోతుందన్న వార్త కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా పరశురాం మహేష్ బాబు సినిమా మే 31 న ప్రారంభం అవుతుందని తెలుస్తుంది.

అంతేకాదు ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, అనిల్ సుంకర ఏ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్, మహేశ్ బాబు ఎంటర్ టెన్నెంట్స్ బ్యానర్స్ లో సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నార్రు. ఇక పరశురామ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా కృష్ణ గారి పుట్టిన రోజు మే 31న మైత్రి ఆఫీస్ లో ప్రారంభం కానుందట. ఇక ఈ సినిమాని ఒక అద్భుతమైన టైటిల్ ని అనుకుంటున్నారట. అదే “సర్కారు వారి పాట”. ఇదే గనక టైటిల్ అయితే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ అని అర్థమవుతోంది. ఇక ఈ టైటిల్ ని కూడా అదే రోజు అనౌన్స్ చేయనున్నారని తాజా సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news