రజినీకాంత్ కి సూపర్ వెల్కమ్ …!

-

సూపర్‌స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడటంతో అపోలో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని.. బీపీ కూడా అదుపులోకి వచ్చిందని అపోలో వైద్యులు ప్రకటించారు. అయితే వారంపాటు రెస్ట్ తీసుకోవాలని అపోలో వైద్యులు రజనీకి సూచించారు.

రజినీకాంత్ గత 10 రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అన్నాత్తై షూటింగ్ కోసం ఆయన నగరానికి వచ్చారు. ఐతే కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర యూనిట్‌లో పలువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత రజినీకాంత్ క్వారంటైన్‌‌‌కు వెళ్లారు. డిసెంబరు 22న రజినీకాంత్‌కు కరోనా పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చింది. ఎలాంటి కరోనా లక్షణాలు కూడా లేవు.సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారన్న వార్త ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ మాత్రమే.. భారత సినీ పరిశ్రమను షేక్ చేసిన విషయం తెలిసిందే. హైబీపీతో జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారన్న వార్త వినగానే అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఆయన ఆరోగ్యంపై అభిమానులు, తారలు టెన్షన్ పడుతున్నారు. తమ అభిమాన నటుడికి ఏమీ కాకూడదని.. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. రజినీకాంత్ క్షేమంగా తిరిగి రావాలని సోషల్ మీడియాలో ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. సాధారణ అభిమానులతో పాటు సిీన తారలు, క్రీడా ప్రముఖులు కోసం రజినీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలపడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.నిన్న హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి చెన్నై బయలుదేరిన రజనీ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌కు ఆయన భార్య లత బొట్టు పెట్టి ఆహ్వానించారుఇదిలాఉంటే.. రజనీకాంత్ డిసెంబర్ 31 న తన రాజకీయ పార్టీని ప్రకటించే విషయంలో ఒత్తిడి రజిని తలపై ఇంకా అలానే కొనసాగుతూనే ఉంది. తలైవా అభిమానులు ఏం చేస్తారా అన్న అనిశ్చితి మధ్య వేచి చూస్తున్నారు. ప్రస్తుత సెన్సిటివ్ హెల్త్ ఇష్యూస్ ని బట్టి పార్టీని పెడతారా లేదా అన్న డైలమా అలానే ఉంది. రజనీకాంత్ `అన్నాథే` షూటింగ్ ను తిరిగి ప్రారంభించటానికి కూడా కొంత విరామం తీసుకోవచ్చు. ఎందుకంటే షూటింగ్ సమయంలో ఈ కోవిడ్ ముప్పు ఉంది. ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది అన్నది కాస్త ఓపిగ్గా వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news