విశాల్, ఆర్య ఇద్దరూ కలిసి ఎనిమీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం విశాల్, ఆర్య ఈవీపీ ఫిలిం సిటీలో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో ఉన్నారు. ఈ ఇద్దరూ కూడా డూప్ లేకుండానే ఆ సీన్ కోసం నటించారు. ఈ సమయంలో నటుడు ఆర్య తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు.
అవసరమైన అన్ని మందులు తీసుకుని తగు జాగ్రత్తలు తీసుకున్నాక ఆయన గాయం ఉన్నప్పటికీ షూట్ పూర్తి చేయడానికి తిరిగి సెట్ లోకి అడుగుపెట్టాడు. వినోద్ కుమార్ మినీ స్టూడియో నిర్మిస్తున్న ఈ సినిమాకి అరిమా నంబి, ఇరు ముగన్, నోటా సినిమాల ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మృణాలిని రవి లేడీ లీడ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అలానే ఈ సినిమాకి ఆర్.డి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.