బాలకృష్ణ నటించిన సినిమాకు సుప్రీంకోర్టు నోటీసులు.. కారణం..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక ఈయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. అలా చారిత్రాత్మకంగా తెరకెక్కించిన చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణ. ఈ చిత్రం మంచి విజయాన్ని అందించడమే కాకుండా బాలకృష్ణను నటన పరంగా కూడా హైలెట్ చేసిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నిర్మాతలు సైతం చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.గౌతమీపుత్ర శాతకర్ణ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించిన వారికి సుప్రీంకోర్టు తాజాగా షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది పన్ను రాయితీ విషయంలో నిర్మాతలైన రాజీవ్ రెడ్డి ,సాయిబాబ జాగర్లమూడి లకు ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. హీరోగా బాలకృష్ణ డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు .ఈ చిత్రం 2017 వ సంవత్సరంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నది. అయితే చారిత్రాత్మకంగా తెరకెక్కించిన సినిమా కాబట్టి ఈ సినిమాకు పన్ను రాయితీ ఇవ్వాలని అప్పట్లో బాలయ్య బాబు ఈ సినిమాకి అడగడం జరిగింది దీంతో అప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ సినిమాకు పన్ను రాయితీ ప్రకటించడం జరిగింది. అయితే ఈ సినిమాకి ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చినా కూడా టికెట్ ధరలలో ఎలాంటి మార్పు లేకుండా అదే రేటుకు అమ్మడంతో సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘాల నేతలు చాలా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.Gautamiputra Satakarni (2017) - IMDb

అయితే నిర్మాతలు ఈ పన్ను రాయితీలను ప్రజలకు ఇవ్వకపోవడంతో తిరిగి ఇప్పుడు ఆ పన్నును రికవరీ చేయాలని కోరుతూ కొంతమంది సినీ ప్రేక్షకులు సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీంతో ఈ కేసు పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్ర విచారణ జరిపిన తర్వాత నిర్మాతలు సాయిబాబ జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు..కొంతమంది ప్రతివాధులకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news