ఆ హీరోకే ఎందుకీ కష్టాలు.. ఇక కెరీర్ ముగిసినట్టేనా..?

-

విలక్షణ నటుడు, పాత్ర కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టే నటుడు సూర్య. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన సూర్యకు ప్రస్తుతం కాలం కలిసి రావడమే లేదు. గజిని, ఆరు వంటి సూపర్ హిట్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సూర్య.. ఈ మధ్య కాలంలో ఒక్క సక్సెస్‌ను కొట్టలేకపోతున్నాడు.

వరుసగా చిత్రాలు బోల్తా కొడుతుండటంలో తెలుగులో మార్కెట్ దెబ్బతింది. కోలీవుడ్‌లోనూ అంతగా ప్రభావం ఉండటం లేదు. ఎన్‌జీకే, బందోబస్త్ భారీ అంచనాలతో దిగినా.. బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఇలా వరుసగా సినిమాలు బెడిసికొడుతుండటంతో సూర్య అభిమానుల్లో ఆందోళలను కలగజేస్తోంది.

అయితే సూర్య తన ఆశలన్నీ ఆకాశం నీ హ‌ద్దురా అనే సినిమాపైనే పెట్టుకున్నాడు. ‘గురు’ ఫేమ్ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ పర్వాలేదనించాయి. ఇక ఈ సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా.. సూర్య కెరీర్ దాదాపుగా ముగిసిపోయినట్టే. ఇప్పటికే సింగం సిరీస్‌తో విసుగు పుట్టి ఉన్న ప్రేక్షకులను ఆ తరహా పాత్రలో సూర్యను చూడాలనుకోవడం లేదు. మరి ఈ మూవీ సూర్యకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూద్దాం.. వాయిదాలు పడుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీ మే 1న రాబోతోందని తెలుస్తోంది. ఇలా వాయిదాలు పడటం కూడా సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news