మహిళలను వేధింపులకు గురిచేస్తే సహించబోం : మంత్రి సీతక్క

-

మహిళలను వేధింపులకు గురిచేస్తే సహించబోమని మంత్రి సీతక్క అన్నారు. మహిళలు సమాజ సృష్టికర్తలు అని కొనియాడారు.సమాజంలో మహిళల పట్ల ఇంకా చిన్న చూపు ఉందని, అందుకే కొన్ని రంగాల్లో మహిళలు వెనుకబడి ఉన్నారన్నారు.శుక్రవారం మాదాపూర్‌ టెక్ మహీంద్రా లెర్నింగ్ వరల్డ్‌లో తెలంగాణ సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్‌వర్కింగ్ (ఐడబ్ల్యుఎన్) నిర్వహించిన వార్షిక లీడర్‌షిప్ కాన్క్లేవ్ 2024 (10)వ ఎడిషన్‌లో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు.

ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు తోటి మహిళలకు తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల గురించి స్పందిస్తూ ఇక మీదట ఎవరైనా అలా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.పని ప్రదేశంలో మహిళలకు రక్షణ లేకపోతే వారెక్కడ సురక్షితంగా ఉంటారని ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news