దేవుడిని కూడా రాజకీయాల్లో వాడుకునే దుర్మార్గుడు చంద్రబాబు : వైఎస్ జగన్

-

దేవుడిని కూడా రాజకీయాల్లో వాడుకునే దుర్మార్గుడు సీఎం చంద్రబాబు అని మాజీ సీఎం  వైఎస్ జగన్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  దేవుడిని కూడా రాజకీయాల్లో వాడుకోగలిగే వ్యక్తి చంద్రబు.. ఇంత అన్యాయస్తుడు ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు  అన్నారు.  తిరుమలకు వచ్చే నెయ్యి గురించి చంద్రబాబు అన్న వ్యాఖ్యల గురించి స్పందించారు.

నాసిరకం వస్తువులు వాడారని, నెయ్యి కి బదులు జంతువుల కొవ్వు వాడారని సీఎం హోదాలో మాట్లాడటం ఆశ్యర్యం కలిగించిందన్నారు. కోట్లాది మంది వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా..? అన్నారు. ప్రోసిజర్ ఏంది.. ప్రక్రియ ఏంది..? ఎలా జరుగుతుందనే దాని గురించి ఒకసారి ఆలోచించండి. ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం జరిగేది. ప్రతీ ఆరు నెలలకొకసారి ఆన్ లైన్ లో టెండర్లు పిలుస్తారు. ఆన్ లైన్ లో పిలిచిన టెండర్లకు రొటిన్ గా జరిగే కార్యక్రమానికి సంబంధించి.. కొత్తగా మార్చేది ఏమి లేదు అని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news