చెక్: రకుల్ హర్ట్ అయ్యిందట.. కారణమిదే..

Join Our Community
follow manalokam on social media

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగన్నరేళ్ళ తర్వాత చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ట్రైలర్ రిలీజై మంచి పాజిటివిటీని తెచ్చుకుంది. చూస్తుంటే ఏదో సస్పెన్స్ మూవీలాగా ఉంది. ఐతే రేపే సినిమా విడుదల అవుతుండడంతో ప్రమోషన్ల హడావిడి ఎక్కువగా ఉంది. ఈ ప్రమోషన్లలో హీరోయిన్ రకుల్ ప్రీత్ కనబడకపోవడమే అందరికీ ఆశ్చర్యంగా మారింది.

ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనూ రకుల్ కనిపించలేదు. మరో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రమే కనిపిస్తూ వచ్చింది. ఒకప్పుడు తెలుగులో స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్, తన సినిమా ప్రమోషన్లకి హాజరు కాకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. దీనిపై ఒక్కొక్కరూ ఒక్కోలా అంటున్నారు. చెక్ సినిమాలో రకుల్ పాత్ర నిడివి తక్కువగా ఉంటుందట. సెకండ్ హీరోయిన్ తో పోలిస్తే తన పాత్ర పరిధి తక్కువట. అదీగాక తన మీద ఒక్క పాట కూడా లేదని సమాచారం. ఇంకా దర్శకుడితో కొన్ని మనస్పర్థలు ఉన్నాయని అంటున్నారు. వీటన్నింటి వల్లే రకుల్ చెక్ సినిమా ప్రమోషన్లకి రావట్లేదని టాక్.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...