ఒక్క “బాబా బాస్క‌ర్” చాలు.. ఒక‌రిని పంపిచేద్దాం..

బాబా బాస్క‌ర్ బిగ్‌బాస్ సీజ‌న్ 3లో అంద‌రినీ ఆక‌ట్టుకుని సెమీ ఫైన‌ల్ వ‌ర‌కు చేరుకున్న కంటెస్టంట్‌. బాబా చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ ప్రేక్ష‌కుల‌చేత శ‌భాష్ అనిపించుకున్నాడు. బాబాకు రిప్లేస్‌మెంట్‌గా బిగ్ బాస్ సీజ‌న్ 4లో ఇద్ద‌రిని తీసుకున్నారు షో నిర్వాహ‌కులు. అమ్మ రాజ‌శేఖ‌ర్‌, సూర్య కిర‌ణ్‌ల‌ను ఇంపోర్ట్ చేశారు.

బాబాను త‌మిళుల కంటే కూడా తెలుగు ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఆద‌రించార‌న్న‌ది చూశాం. అయితే ఆయ‌న మ్యాజిక్ బిగ్‌బాస్4లో రిపీట్ చేద్దామ‌నుకున్న నిర్వాహ‌కుల‌కు చేదు గుళిక‌లే ప‌డ్డాయి. అమ్మ రాజ‌శేఖ‌ర్ జోకులు కుళ్లిపోవ‌డం, సూర్య కిర‌ణ్ కిరికిరి జ‌నాల‌కు ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. హౌస్‌లో ఉన్న కంటెస్టంట్స్‌పై కుళ్ళు జోకులు వేస్తున్నా అమ్మ రాజ‌శేఖ‌ర్ ఇప్ప‌టికైతే సేఫ్‌. అన‌వ‌స‌ర విష‌యాల్లో పెద్ద‌రికం చూపించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న సూర్య కిర‌ణ్ ఎలిమినేష‌న్‌లో ఉన్నాడు.

అయితే సూర్య కిర‌ణ్‌ను ఇంటి నుంచి పంపించేందుకు ప్రేక్ష‌కులు ఇష్టం చూపిస్తున్నారు. కానీ బిగ్ బాస్ మాత్రం కాంట్ర‌వ‌ర్సీల కోస‌మైన ఉంచేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడా అనిపిస్తుంది. ఇక్క‌డ ప్రేక్ష‌కులు మాత్రం ఒక్క త‌మిళ కంటెస్టంట్ చాలు కిరికిరి కిర‌ణ్‌ను పంపిచేద్దాం అంటూ త‌మ అభిప్రాయాన్ని చెబుతున్నారు.

ఎక్క‌డా కూడా పెద్ద‌రికం ప్ర‌ద‌ర్శించ‌కుండా.. ప్ర‌తీదాన్ని గేమ్ అనే విధంగా చూస్తున్నాడంటూ సూర్య కిర‌ణ్‌పై నెగెటివ్ కామెంట్లు ప‌డుతున్నాయి. చూద్దాం బిగ్ బాస్ ప్రేక్ష‌కుల అభిప్రాయానికి విలువ‌నిస్తాడా.. నా షో నా ఇష్టం అంటూ కాంట్ర‌వ‌ర్సీ యాంగిల్‌లో అట్టె పెట్టేసుకుంటాడా…?