జ్యోతిక వ్యాఖ్యలను సమర్ధించిన సూర్య …!

-

జ్యోతిక…కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. బాగా పాపులర్ అయింది. అలాగే తెలుగులోను నటించింది. తెలుగులో చేసిన సినిమాలు రెండే అయినా తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది. వాలి సినిమాతో పరిచయమైన జ్యోతిక లోలీవుడ్ స్టార్ హీరో సూర్యని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. గౌతం వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన కాక్క కాక్క సినిమాతో సూర్య జ్యోతిక ప్రేమలో పడ్డారు. పెళ్ళి తర్వాత జ్యోతిక సినిమాలకి కొంతకాలం దూరంగా ఉన్నారు.

 

అయితే రీసెంట్ గా మళ్ళీ సినిమాలలో నటించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. 2019 లో ‘రాచ్చసి’ సినిమాలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో నటనకు గాను ‘జేఎఫ్‌డబ్ల్యూ మూవీ అవార్డ్స్ 2020’లో ఆమె ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో అవార్డు తీసుకున్న జ్యోతిక మాట్లాడుతూ కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించింది.

హాస్పిటల్, స్కూల్స్‌ను ఇంకా బాగా నిర్వహించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపింది. ఈ సందర్భంగాలోనే జ్యోతిక ‘మనం ఆలయాలను బాగా శుభ్రం చేస్తాం, పెయింట్ వేస్తాం, బాగా మెయింటైన్ చేస్తాం, ఆలయ హుండీలో డబ్బులు వేస్తాం. దయచేసి అవే డబ్బులు హాస్పిటల్స్‌కు పెట్టండి, పాఠశాలల అభివృద్ధికి వాడండి. ఇది చాలా ముఖ్యం. దయచేసి హాస్పిటల్స్, స్కూల్స్‌కు కూడా విరాళాలు ఇవ్వండి’ అంటూ వ్యాఖ్యానించింది.

అయితే ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద సంచలనం అయింది. సోషల్ మీడియా వేదికగా రక రకాల చర్చలకు దారితీసింది. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన సూర్య.. తన భార్య జ్యోతిక చేసిన వ్యాఖ్యలకి కట్టుబట్టి ఉన్నామన్నారు. మానవ సేవే మాధవ సేవ అని పెద్దలు చెప్పారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో మాకు దక్కిన ఆధరణకు కృతజ్ఞతలు. పెద్దలు, ఆధ్యాత్మిక వేత్తలను అనుసరించి మేం వ్యక్తపరిచిన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నాం’ అంటూ వివరణ ఇచ్చారు సూర్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version