కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా ‘ఆచార్య’. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో ఈ సినిమా కూడా ఆగిపోయింది. ‘భరత్ అనే నేను’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. వరస సినిమాలు చేస్తున్న కొరటాల శివకి చిరంజీవి తో సినిమా అనేసరికి చాలా గ్యాప్ వచ్చింది.
ఇటువంటి తరుణంలో చిరంజీవి సినిమా నడుస్తూ ఉండగానే పారాలల్ గా అక్కినేని అఖిల్ సినిమా చేయాలని కొరటాల డిసైడ్ అయినట్లు ఫిలింనగర్లో వార్తలు వస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు అఖిల్ హిట్ కోట్టలేకపోయాడు. దీంతో ఈ పూర్తి బాధ్యతను అక్కినేని నాగార్జున శివ చేతిలో పెట్టినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే అఖిల్ కి సంబంధించి కొరటాల శివ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు, అంతా కుదిరితే చిరంజీవి సినిమా తో పాటు ఈ సినిమా కూడా స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.