యూట్యూబ్ ని ఊపేస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ‘సూర్యుడివో చంద్రుడివో’ సాంగ్…..!!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు మైండ్ బ్లాక్ అనే లిరికల్ సాంగ్, మంచి హిట్ సాదించడంతోపాటు సినిమా పై ప్రేక్షకుల్లో మరియు మహేష్ అభిమానుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. వరుసగా మహేష్ నటిస్తున్న ఈ మూడవ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను, మహర్షి సినిమాల్లోని సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి. ఇకపోతే నేడు సరిలేరు నీకెవ్వరు నుండి సూర్యుడివో చంద్రుడివో అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్ ని సినిమా యూనిట్ కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. మహేష్ బాబు, విజయశాంతి సహా మరికొందరు ఆర్టిస్టుల పై చిత్రీకరించబడ్డ ఈ లిరికల్ వీడియో సాంగ్ కు శ్రోతల నుండి విశేషమైన స్పందన లభిస్తోంది. ప్రముఖ పంజాబీ సింగర్ బి ప్రాక్ ఆలపించించిన ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ ని అందించారు. ఇక దేవిశ్రీ అందించిన సుపర్బ్ మెలోడియస్ ట్యూన్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా ఏళ్ళ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల పై ఎంతో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా2020 జనవరి 11 న రిలీజ్ చేయనున్నారు…….!!

Read more RELATED
Recommended to you

Latest news