వాళ్ళు మన పెళ్ళి చేస్తారట ..డార్లింగ్ ..ఏం చేద్దాం..?

-

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ జీవితంలో ఒక్క విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేకుండా ఉంది. అదే ఆయన పెళ్ళి విషయం. ప్రతీ సంవత్సరం ఇదుగో అదుగో అంటు ప్రభాస్ పెళ్ళి అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి గాని ఆ పెళ్ళి ముహూర్తం మాత్రం రావడం లేదు. ప్రభాస్ సినిమా కోసం ఎంతగా జనాలందరు ఆతృతగా ఎదురు చూస్తుంటారో ఆయన పెళ్ళి కబురు కోసం కూడా అంతే ఆతృతగా ఎదురు చూసున్నారు.

 

ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ప్రబాస్ డియరెస్ట్ ఫ్రెండ్ స్వీటి అనుష్క కి ఇంకా పెళ్ళి కాలేదు. అంటే ఇంకా పెళ్ళి చేసుకోలేదు. అందుకే ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని అందుకే ఇంకా పెళ్ళి చేసుకోంది అందుకే అని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలకి బలం చేకూరుస్తూ ప్రభాస్ అనుష్క ఏ పబ్లిక్ ఫంక్షన్ కైనా కలిసే రావడం బయట కలిసి తిరగడం తోడయింది. అయితే ఎన్ని సార్లు ఈ విషయం అడిగినా అటు ప్రభాస్ గాని ఇటు స్వీటీ గాని ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వడం లేదు.

పొడి దగ్గులాగా సమాధానం చెబుతూనే వస్తూన్నారు తప్ప తెగ తెంపులుగా మాత్రం ఈ ఇద్దరు చెప్పడం లేదు. దాంతో ఇప్పటికే చాలా సార్లు సోషల్ మీడియాలో అనుష్క ప్రభాస్ పెళ్ళి చేసుకోబోతున్నారని .. సీక్రెట్ గా ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ మధ్య కూడా మళ్ళీ మీడియా వాళ్ళు ప్రభాస్ అనుష్క కి పెళ్ళి అంటూ వార్తలు రాశేసారు. ఇది తెలుసుకున్న అనుష్క .. ప్రభాస్ తో మళ్ళి మన పెళ్ళి కి సంబంధిన రూమర్ వచ్చింది చూశావా ..? అంటూ ప్రభాస్ ని అడిగిందట. అంతేకాదు వాళ్ళు మన పెళ్ళి చేస్తారట డార్లింగ్ అంటూ మీడియా మీద సెటైర్ వేసిందట. మరి వీళ్ళు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారో గాని అప్పటి వరకు ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టడం కష్టమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version