వామ్మో ‘సైరా’ సినిమా కి ఇంత లాస్ వచ్చిందా ?

698

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత రామ్ చరణ్ ‘సైరా’ సినిమాని నిర్మించడం జరిగింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అని రకరకాల వార్తలు వచ్చాయి. అక్టోబర్ 2వ తారీఖున దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమాకి తెలుగు సినిమా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే తాజాగా సినిమా వచ్చి చాలా నెలలు కావస్తున్న క్రమంలో ‘సైరా’ సినిమా కలెక్షన్ల గురించి చాలా లాస్ వచ్చినట్లు ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related image

‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలని టార్గెట్ గా పెట్టుకొని తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ,కన్నడ భాషల్లో విడుదలయ్యింది. అయితే సినిమాకి వచ్చిన కలెక్షన్లు బట్టి చూస్తే అప్పట్లో అనేక రికార్డులు మరియు కలెక్షన్లు కూడా ఫుల్లుగా వచ్చినట్లు వార్తలు వచ్చినా గానీ దాదాపు ఈ సినిమా టోటల్ గా 70 కోట్ల మేరకు నష్టం తెచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు బలంగా వినబడుతున్నాయి. దీంతో ఈ వార్త విన్న సోషల్ మీడియాలో మెగా అభిమానులు వామ్మో ఇంత లాస్ అని కామెంట్ చేస్తున్నారు.

 

ఇందు మూలంగానే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నిర్మితమవుతున్న సినిమా విషయంలో ఎక్కడా కూడా అనవసరపు ఖర్చులకు పోకుండా నిర్మాత రామ్ చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఈ సినిమాతో సైరా లాస్ ను కవర్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కచ్చితంగా ఈ సినిమా కూడా థియేటర్ – నాన్ థియేటర్ కలిపి 150 కోట్ల మేరకు మార్కెట్ అవుతుంది. సినిమాను 70 నుంచి 80 కోట్లలో తీయగలిగితే సైరా లాస్ లు కవర్ అయిపోతాయనే కోణంలో రామ్ చరణ్ ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. ఇదే సందర్భంలో కొరటాల శివ కూడా చాలా తక్కువ రోజుల్లోనే సినిమా కంప్లీట్ చేయడానికి పక్క షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం.