సైరా ‘సిద్ధమ్మ’ మోస్టర్ పోస్టర్

-

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతుంది. కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ మూవీలో చిరు సరసన నయనతార నటిస్తుంది.

సినిమాలో నరసింహా రెడ్డి భార్య సిద్ధమ్మగా నయన్ నటిస్తుంది. దానికి సంబందించిన మోషన్ పోస్టర్ నయన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. కోలీవుడ్ లో సోలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకు సైతం షాక్ ఇస్తున్న నయనతార ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లో భాగం అవడం గొప్ప విషయం. సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు లాంటి ఎంతోమంది స్టార్స్ నటిస్తున్నారు.

సైరా సిద్ధమ్మగా నయన్ తన లుక్ తో ఆకట్టుకుంది అంతి త్రివేది మ్యూజిక్ అందిస్తున్న ఈ సైరా సినిమా 2019 సమ్మర్ రేసులో దిగుతుంది. మరి ఖైది నంబర్ 150 తర్వాత బాక్సాఫీస్ పై తన సత్తా చాటేందుకు వస్తున్న ఈ సైరా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version