‘అల వైకుంఠపురములో’ టబు రోల్ అదేనా….!!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘అల వైకుంఠపురములో’. వీరిద్దరి కాంబినేషన్లో మూడవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ పై బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా బాగానే అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సాంగ్స్ కూడా యూట్యూబ్ లో మంచి వ్యూస్, లైక్స్ దక్కించుకుని, సినిమాపై విపరీతంగా అంచనాలు పెంచేయడం జరిగింది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా,సీనియర్ నటి టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది.
కాగా ఆమె క్యారెక్టర్ విషయమై నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త ప్రచారం అవుతోంది. అదేమిటంటే, ఈ సినిమాలో టబు, బన్నీకి అక్కగా నటిస్తోందని, ఆమె కారణంగానే కొన్ని సమస్యల్లో ఉన్న వారి కుటుంబం బయట పడుతుందని, ఆ విధంగా సినిమాని కీలకంగా కొంత మలుపు తిప్పే పాత్రలో టబు నటిస్తోందని సమాచారం. అయితే మొదట ఈ పాత్రకు పలువురు నటీమణులను పరిశీలించినప్పటికీ, చివరకు టబు అయితేనే దానికి పూర్తిగా న్యాయం చేయగలరని భావించి ఆమెను ఎంపిక చేసిందట సినిమా యూనిట్.
Tabu role In Alavaikunthapurramuloo Movie
Tabu role In Alavaikunthapurramuloo Movie
ఇక ఇతర పాత్రల్లో సునీల్, నవదీప్, నివేత పేతురాజ్, సుశాంత్ అక్కినేని, రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ నటిస్తున్నారు. పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్న ఈ సినిమాకు నవీన్ నూలి ఎడిటింగ్ ని అందిస్తుండగా, ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో ఈ సినిమా అఫీషియల్ టీజర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతోందట సినిమా యూనిట్. బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ చేయనున్నారు…..!!

Read more RELATED
Recommended to you

Latest news