Tamanna: ఆ హీరోతో సినిమా వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నా..!

-

Tamanna: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మంచు మనోజ్ నటించిన “శ్రీ” సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది ఈ గ్లామరస్ బ్యూటీ. ఆ తర్వాత హ్యాపీడేస్ మూవీ తో సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా తర్వాత తమన్నాకి తెలుగులో కుప్పలు తెప్పలుగా వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి.

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్ని ఏళ్లయినా వరుస సినిమాలతో దూసుకుపోతుంది తమన్నా. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లతో కూడా బిజీగా మారింది. తాజాగా రజనీకాంత్ జైలర్ సినిమాతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. అయితే తన కెరీర్ ఆరంభంలో మిస్ చేసుకున్న ఓ సినిమా గురించి ఇప్పటికీ బాధపడుతుందట తమన్నా. ఆ సినిమా మరేదో కాదు.. దశరథ్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మిస్టర్ ఫర్ఫెక్ట్.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అయితే కాజల్ పాత్ర కోసం ముందు తమన్నాని అనుకున్నారట. కానీ ఆ సమయంలో డేట్స్ ఖాళీ లేక తమన్నా ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. ఈ సినిమాని వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని తెలిపింది తమన్నా. ఆ మూవీ తనకు ఎంతగానో నచ్చిందని.. కానీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news