చీరకట్టులో ఓర చూపుతో మాయ చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా

-

తమన్నా భాటియా.. ఈ మిల్కీ బ్యూటీ పదేళ్లకు పైగా తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తోంది. అవకాశాలు తగ్గినా.. ఈ భామ అగ్ర కథానాయికగానే కొనసాగుతోంది. ఇక ఈ బ్యూటీ ఇటీవల తన ఫోకస్ అంతా బాలీవుడ్​పై పెట్టింది. అయినా తెలుగు సినిమాల్లోనూ అవకాశాలు పొందుతోంది. తాజాగా ఈ బ్యూటీ ఇద్దరు స్టార్ హీరోలతో జతకట్టింది.

ఓ వైపు సూపర్ స్టార్ రజనీ కాంత్​తో జైలర్.. మరోవైపు మెగా స్టార్ చిరంజీవితో భోళా శంకర్​లో ఆడి పాడింది. ఈ సినిమాలు ఒక్క రోజు వ్యవధితో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమన్నా ఈ సినిమాల ప్రమోషన్స్​లో బిజీబిజీగా ఉంది. ఇందులో జైలర్ పాన్ ఇండియా లెవెల్​లో విడుదల కాబోతోంది.

అయితే తాజాగా తమన్నా ఈ ప్రమోషన్స్ కోసం ట్రెడిషనల్​గా కనిపించింది. చీరకట్టులో నిండైన అందంతో మైమరిపించింది. ఇక తన ఓరచూపులతో మాయ చేసింది. కాటుక కళ్లతో నిషా నింపిన చూపుతో మత్తెక్కించింది. ప్రస్తుతం తమన్నా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ట్రెడిషనల్ లుక్​లో బుట్టబొమ్మలా ఉన్నావ్ ట్యామీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news