హోస్టుగా మారుతున్న త‌మ‌న్నా.. దేన్నీ వ‌ద‌ల‌ట్లేదుగా..!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాకు ఉన్న క్రేజ్ ఏంటో అంద‌రికీ తెలిసిందే. చిన్న సిన‌మాతోని టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి త‌క్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సీనియ‌ర్ హీరోయిన్లు సినిమాలు త‌గ్గించినా త‌మ‌న్నా మాత్రం ఇప్ప‌టికే వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. ప‌దేళ్ల‌కుపైగా తెలుగు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.

 

వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోవ‌డం లేదు. సినిమాల‌తోపాటు టీవీ, డిజిట‌ల్ ఫీల్గుపై కూడా స‌త్తా చాటుతోంది. రీసెంట్‌గా లెవెన్త్ అవర్ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ బాట ప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు మ‌రో వెబ్ సిరీస్ నవంబర్ స్టోరీ అనే దాంట్లో న‌టిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పంతా మార్చింది త‌మ‌న్నా.

ఓ ప్ర‌ముఖ టీవీ ఛానెల్ లో వంట‌ల ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా చేయ‌డానికి త‌మ‌న్నా ఒప్పుకుందంట‌. మాస్టర్ చెఫ్ తరహాలో ప్రోగ్రామ్‌కు ఇప్ప‌టికే త‌మ‌న్నా సైన్ కూడా చేసింద‌ని తెలుస్తోంది. ఇది త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌వుతుంది. ఇక ఇప్పుడు సీటీమార్ సినిమాలో న‌టిస్తోంది. అలాగే నితిన్ తో చేస్తున్న మ్యాస్ట్రో మూవీలో నెగెటివ్ రోల్ లో క‌నిపించ‌నుంది త‌మ‌న్నా. అలాగే ఎఫ్‌-3లో న‌టిస్తూ ఇప్ప‌టికీ వ‌రుస సినిమాల‌తో బిజీగానే ఉంటోంది.