తన దగ్గరున్న డైమండ్ రింగు పై అసలు గుట్టు విప్పిన తమన్నా..!

-

మిల్క్ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నా అదే ఊపుతో దూసుకుపోతోంది అంటే దానికి కారణం ఆమె కెరియర్ ను చక్కగా ప్లాన్ చేసుకోవడమే అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా వంటి వెబ్ సిరీస్ లు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న ఈమె ఒక్కసారిగా శృంగార సన్నివేశాలలో రెచ్చిపోయి హాట్ టాపిక్ గా మారింది. ఇక తమన్నా విషయానికి వస్తే.. శ్రీ అనే సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఈమె హ్యాపీ డేస్, 100% లవ్ వంటి సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. తాజాగా భోళా శంకర్ సినిమాలో, జైలర్ చిత్రంలో కూడా నటించింది.

ఇదిలా ఉండగా తమన్నా గురించి ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది. ఆమె చేతికి డైమండ్ తో ఉన్న ఒక ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే దీనిని మెగా కోడలు ఉపాసన ఆమెకు బహుమతిగా అందించిందని.. ప్రపంచంలోనే ఇది ఐదవ ఖరీదైన వజ్రం అని.. దీని ఖరీదు సుమారుగా రూ.2కోట్లు అని ఒక వార్త ఎప్పటినుంచో వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు ఇప్పటికి తమన్నా చెవిన చేరడంతో ఎట్టకేలకు ఆమె స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చింది.

 

ఇది డైమండ్ కాదు అని సోడా బాటిల్ ఓపెనర్ అని క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. చూడడానికి బాగుండడంతో ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు తెలిపింది. ఇక ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఈ సెలబ్రిటీలు ఏం చేసినా అది వైరల్ గానే మారుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news